
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. గత నాలుగు సంవత్సరాల నుండి అవినీతి కేసులో ఈమె నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. శశికళ కరోనా బారిన పడటంతో ప్రస్తుతం ఆమె విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు. మరో 10 రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 20న శశికళకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే ఆమెకు కరోనా లక్షణాలు ఏవీ లేవని వెల్లడించారు. ఆమె ఎప్పుడు చెన్నై వెళ్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.