శిఖర్ ధావన్ కు కోర్టు చార్జిషీట్ దాఖలు ఎందుకంటే…!?

January 28, 2021 at 1:18 pm

సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి షేర్ చేయడం ఈమధ్య అందరికి అలవాటు అయిపొయింది. ఇలా ఒక క్రికెటర్ తాను చేసిన ఒక పనిని ఫోటో తీసి అది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ ఫోటోనే అతన్ని చిక్కుల్లో పడవేసింది.ఇంతకీ ఆ టీం ఇండియా క్రికెటర్ మరెవరో కాదు.. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్. అతను చేసిన చిన్న తప్పు ఇప్పుడు చిక్కుల్లో పడవేసింది . దీంతో అతనిపై వారణాసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలైంది. ఇటీవల గంగా నదిలో పడవపై వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న పక్షులకు ధావన్ ఆహరం తినిపించాడు.

ఈ సీన్ మొత్తాన్ని అతను ఫోటోల రూపంలో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ఇది బర్డ్ ఫ్లూ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందంటూ అడ్వొకేట్ సిద్ధార్థ్ శ్రీవాస్తవ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఫిబ్రవరి 6న విచారణ జరపనుంది.అయితే కేవలం ఆ పడవ నడిపిన వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకుంటామని, ధావన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోబోమని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కౌషల్ రాజ్ శర్మ ఈమధ్యనే చెప్పారు.

శిఖర్ ధావన్ కు కోర్టు చార్జిషీట్ దాఖలు ఎందుకంటే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts