
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్, నటాషా పెళ్లి ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఇంటివాడైన వరుణ్‌కు జెర్సీ ఫేం శ్రద్దా శ్రీనాథ్ వివాహ శుభాకాంక్షలు తెలియజేసింది. తాను విషెస్‌తోపాటు ఓ సెటైరికల్ పోస్ట్ కూడా పెట్టింది. శ్రద్ధాశ్రీనాథ్ పెట్టిన పోస్ట్ తో చాలా మంది సినీ ప్రేమికులు సందేహం వ్యక్త పరుస్తున్నారు.
మరో మంచి యాక్టర్ దూరం కాబోతున్నాడు. వరుణ్‌ను మనం మళ్లీ స్క్రీన్ పై ఇక చూడలేము. వివాహం తర్వాత వరుణ్ ఇతర హీరోయిన్లతో కలిసి నటించేందుకు తన భార్య మరియు బంధువులు ఒప్పుకోరు. వరుణ్ మేల్ ఓరియెంటెడ్ సినిమాలకు స్వస్తి చెప్పవచ్చేమో. ఇకమీదట వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపర జీవితాన్ని వరుణ్ ఎలా బ్యాలెన్సింగ్ చేస్తాడో. అడి చాలా కష్టమైన పని. అతన్ని మిస్ మిస్సవుతున్నాం. వరుణ్ కు శుభాకాంక్షలు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో సెటైరికల్ పోస్ట్ పెట్టింది శ్రద్ధ.