
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించినున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. మాఫియా నేపథ్యంలో పూర్తి యాక్షన్ ప్రధానంగా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది.
అయితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరా అన్నది గత కొంత కాలం నుంచి సస్పెన్స్ నెలకొంది. అయితే తాజాగా ఈ సస్పెన్స్‌కు సలార్ యూనిట్ తెర దించింది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ను రివిల్ చేశారు. ప్రభాస్‌కు జోడిగా శ్రుతి నటించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
చార్మింగ్ బ్యూటీని సలార్ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది ప్రొడక్షన్ హౌజ్ హోంబలె ఫిల్మ్స్. అంతేకాదు, నేడు శ్రుతిది బర్త్‌డే సందర్భంగా.. ఆమెకు సలార్ యూనిట్ విషెస్ కూడా తెలియజేశారు. దీంతో ప్రభాస్-శ్రుతిహాసన్‌లను సిల్వర్ స్కిన్‌పై చూసేందుకు అభిమానులు తెగ ఉత్సాహపడుతున్నారు.