
శ్రుతిహాసన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడగు పెట్టిన శ్రుతిహాసన్.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మరోవైపు తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నట్టించి సత్తా చాటింది. వరుస ఆఫర్లతో జోరు మీదున్న సమయంలో శ్రుతి ఒక్కసారిగా సినిమాలకు దూరమై మైఖేల్ కోర్సలేకు బాగా దగ్గరైంది.
సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ ముంబైలోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో అతడితో సహజీవనం ప్రారంభించింది శ్రుతి. దీంతో కమల్ హాసన్ ఇంట పెళ్లి భాజా మోగునులే అని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా శ్రుతి బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసింది. అనంతరం కొన్ని రోజులు డిప్రెషన్లో ఉన్న శ్రుతిహాసన్ మళ్లీ సినిమాలతో బిజీగా అయింది. ఈ క్రమంలోనే తాజాగా రవితేజ హీరోగా వచ్చిన `క్రాక్`లో నటించి మంచి హింట్ అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన శ్రుతి పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియా ద్వారా శ్రుతి చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఓ నెటిజన్లు.. ఈ ఏడాదే మీ పెళ్లి ఉంటుందని అంటున్నారు.. నిజమేనా? అని ప్రశ్నించారు. దీంతో అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టి పారేసింది శ్రుతి. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెప్పింది. ఇక మరో నెటిజన్ మాజీ ప్రియుడు మైఖెల్‌ను అసహ్యించుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు.. శ్రుతి తాను ఎవరినీ అసహ్యించుకోను, కానీ, కొంత బాధ మాత్రం ఉందని తెలిపింది. మొత్తానికి నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు శ్రుతి చాలా ఓపిగ్గా చెప్పింది.