
టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరైన సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మ్యాంగో మాస్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న సునీత.. ఇటీవల జనవరి 9న వివాహం చేసుకున్నారు. శంషాబాద్‌లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత- రామ్ వీరపనేని వివాహం ఘనంగా జరిగింది.
ఇదిలా ఉంటే.. తాజాగా రామ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రామ్ పూర్తి పేరు రామకృష్ట వీరపనేని. ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చిన మొదట నటుడిగా కెరీర్ ప్రారంభించారు. జగపతిబాబు స్వప్నలోకం, వెంకటేష్ జయం మనదేరా, మహేష్ బాబు బాబీ లాంటి సినిమాల్లో నటించాడు ఈయన. ఆ తర్వాత డిజిటల్ మీడియాలో అడుగు పెట్టి ఫుల్ సక్సెస్ అయ్యారు.
ఈ క్రమంలోనే వందల కోట్ల ఆస్తులను కూడా సంపాదించాడు. ఇక రామ్ 1996లో స్థాపించిన మ్యాంగో మీడియాతో టాలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులకు మంచి అనుబంధం ఉంది. ఇక మాంగో మ్యూజిక్కు సునీత ఎన్నో పాటలు పాడింది. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమే ఇప్పడు రామ్-సునీతలను దాంపత్యం వైపు అడుగులేసేలా చేసింది.