
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సయ్యద్ సోహైల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొత్త బంగారులోకం సినిమాతో వెండితెరపై నటుడిగా సోహైల్ ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటి వరకు ఈయన ఎవరికీ తెలియదు. కానీ, బిగ్ బాస్ హైస్‌లో ఎప్పుడైతే సోహైల్ ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటి నుంచి అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఈసారి సీజన్లో విన్నర్ అభిజీత్, రన్నర్ అఖిల్ అయినప్పటికీ.. టాప్ 3 కంటెస్టెంట్ అయిన సోహెల్ కే ఎక్కువ పాపులరిటీ వచ్చింది. ఇక హౌస్ నుంచి వచ్చాక సోహైల్‌కు వరుస సినిమా అవకాశాలు కూడా వెళ్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ సీజన్ 4 ఫినాలేలో తాను గెలుచుకున్న రూ.25 లక్షల్లో పది లక్షలు అనాధాశ్రమానికి ఇస్తానని మాటిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు సోహైల్. తన క్యాష్ ప్రైజ్ లో 10 లక్షలను హైదరాబాద్ సిటీ క్లబ్ లో పలువురు ప్రముఖులు సమక్షంలో ఒక్కో అనాధాశ్రమానికి రెండేసి లక్షల చొప్పున డొనేట్ చేసాడు. అంతే కాకుండా తన భవిష్యత్తు సంపాదనలో కూడా 10 నుంచి 15 శాతం వరకు చారిటీకే ఇస్తానని మాటిచ్చాడు.