చిన్నారికి గుండె ఆప‌రేష‌న్ చేయించిన సోనూ..!!!

January 24, 2021 at 2:31 pm

అందరికి లేద‌న‌కుండా సాయం చేస్తూ వెళుతున్న హీరో సోనూసూద్ ప్ర‌జ‌ల గుండెల‌లో దేవుడిగా నిలిచాడు. ఎంత మందికూ ఆక‌లి తీరుస్తూ, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి మంచి వైద్యం అందిస్తూ తన మంచి మ‌న‌సు చాటు కుంటున్నాడు. సోనూ సేవ‌ల‌కు ప్ర‌జ‌లు ఫిదా అయ్యి ఆయ‌న‌కు గుడి క‌ట్టి మరీ పూజ‌లు చేస్తున్నారు. లాక్ డౌన్ టైములో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సోనూసూద్ త‌ర్వాత కూడా వాటిని ఇంకా చేస్తూనే ఉన్నాడు.

తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ బాబుకి సాయం చేశారు సోనుసూద్. పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవర పేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి కూలీల ఎనిమిది నెలల బాబుకి గుండె వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమ‌త లేక‌పోవ‌డంతో సోనూసూద్ ట్ర‌స్ట్‌ను సంప్ర‌దించారు వాళ్ళు. వారి బాధని అర్దం చేసుకున్న సోనూ ఆ బాబుకి ముంబైలోని నారాయణ హృదాలయ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. బాలుడికి గుండె ఆపరేషన్‌ కు అయ్యే ఖర్చు మొత్తం అంతా సోనూనె భరించారు. ఈ విష‌యం తెలుసుకున్న అందరు సోనూసూద్‌పై ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తున్నారు.

చిన్నారికి గుండె ఆప‌రేష‌న్ చేయించిన సోనూ..!!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts