
కరోనా లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే పున:ప్రారంభమైన మూవీ థియేటర్లకు క్రాక్ చిత్రం థియేటర్లకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. సగం ఆక్యుపెన్సీతో నడుస్తున్నప్పటికీ మాస్ మహారాజ్ రవితేజ తన సత్తా చాటాడు. క్రాక్ మూవీ ఇప్పటి వరకు ఏకంగా రూ.20 కోట్ల వరకు వసూళ్లను రాబటింది. దాదాపు రూ.17 కోట్లకు అమ్ముడుపోయిన ఈ మూవీ లాభాలు తెచ్చి పెట్టింది.
కరోనా ప్రభావం కొనసాగుతుండగా, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తుండగా ఈ మేరకు వసూళ్లు రాబట్టడం మాములు విషయం కాదు. అయితే ఈ చిత్రాన్ని హీరో సోనూసూద్ హిందీలోకి రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో బాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని సోనూసూద్ యోచిస్తున్నట్లు టాక్. రీమేక్ హక్కుల కోసం క్రాక్ నిర్మాత ఠాగూర్ మధుతో సోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. కానీ దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.