శ‌ర్వానంద్ ‘శ్రీకారం’ రిలీజ్ డేట్ ఖరారు..!!

January 24, 2021 at 2:06 pm

ప్రముఖ యాక్టర్ శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం తెలుగు నాట ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఆడాళ్ళు మీకు జోహార్లు, మ‌హాస‌ముద్రం సినిమాలతో పాటు శ్రీకారం అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని సంయుక్తన్గా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్ లీడ‌ర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు.

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’కు మంచి మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె. మేయ‌ర్ శ్రీ‌కారం సినిమాకి కూడా త‌న‌ శైలిలో మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. మ‌హా శివ‌రాత్రి పండుగ కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మూవీ బృందం ప్ర‌క‌టించింది.

శ‌ర్వానంద్ ‘శ్రీకారం’ రిలీజ్ డేట్ ఖరారు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts