
శ్రుతి హాసన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా కాలం తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతి హాసన్.. ఇప్పుడు ఓ ఛాలెంజింగ్ రోల్ చేసేందుకు రెడీ అయింది. కరోనా పుణ్యమా అని పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుట్టుకురావడంతో వెబ్ సీరీస్ నిర్మాణం బాగా ఊపందుకుంది.
ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. తాజాగా శ్రుతి హాసన్ కూడా వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధం అయిందట. అది కూడా ఓ సీనియర్ స్టార్ ప్రేయసి పాత్రలో కనిపిచనుందట. `ది బెస్ట్ సెల్లర్ షీ రోట్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. దీనిని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు.
ఓ సూపర్ స్టార్ నవలా రచయితకూ, అతని ప్రేయసికీ మధ్య జరిగే ప్రేమకథగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది. అయితే రచయితగా మిథున్ చక్రవర్తి నటిస్తుంటే, అతని ప్రేయసిగా శ్రుతి కనిపించనుందట. ముకుల్ అభ్యంకర్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుంటే, సిద్ధార్థ్ పి.మల్హోత్రా ఈ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవలె ప్రారంభం అయింది.