సిక్సర్ కొట్టిన సన్నీ లియోన్‌..!

January 26, 2021 at 4:02 pm

డేటింగ్‌ రియాలిటీ షో అయిన స్పిట్ల్స్‌విల్లా షూటింగ్‌ కోసం కేరళలో ఉన్న బాలీవుడ్‌ ప్రముఖ అందాల నటి సన్నీ లియోన్‌ ఓ పార్క్‌లో క్రికెట్‌ ఆడుతూ ఉన్న వీడయోను సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ఈ వీడియోలో సన్నీ లియోన్‌ బ్యాట్‌ పట్టుకుని బంతిని దూరంగా కొడుతూ కనిపిస్తుంది. తాను టీమిండియాలో చేరేందుకు రెడీగా ఉన్నా అంటూ నవ్వులు కురిపించింది.

భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటించనున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌పై బరిలోకి దిగేందుకు కిట్‌ను సర్దుకోవాలా అంటూ హాస్యంగా చమత్కరించింది. తన ఇన్‌స్టాగ్రాంలో సన్నీ షేర్‌ చేసిన వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ సిక్సర్‌ కొట్టావంటూ ఫైర్‌ ఎమోజీలను జత చేస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. మిడిలార్డర్‌లో మీలాంటి డేంజరస్‌ బ్యాట్స్‌మెన్లు అవసరమని ఒక్క నెటిజెన్ కామెంట్‌ చేయగా, నైస్‌ షాట్‌ సన్నీ అంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేసారు.

సిక్సర్ కొట్టిన సన్నీ లియోన్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts