వైరల్ : గుర్రంపై వెళ్లి పార్సెల్స్ డెలివరీ…ఎక్కడంటే..!?

January 17, 2021 at 3:41 pm

ప్రస్తుతం చాలా మంది షాపింగ్ కి దాదాపుగా వెళ్లడం తగ్గించేశారు. తమకు కావాల్సిన వస్తువులన్నీ ఇప్పుడు ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. చాలా తక్కువ ధరకు వస్తువులు దొరుకుతుండటం ఇంకా ఇంటికే వస్తుండటంతో ప్రజలు ఈ కామర్స్ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల అనేక మందికి ఉపాధి కూడా లభించింది. అయితే తాజాగా అమెజాన్లో పని చేసే ఓ కొరియర్ బాయ్ గుర్రం మీద వెళ్లి మరి డెలివరీ ఇస్తున్నాడు. నిజానికి కొరియర్ సర్వీస్ వారు టూ వీలర్ మీద వస్తువులు తీసుకొస్తుంటారు. ఒకవేళ వస్తువు పెద్దది అయితే వ్యాన్లో తీసుకొస్తారు. కానీ జమ్ము కశ్మీర్లో ఓ కొరియర్ బాయ్ మాత్రం గుర్రం మీద వెళ్లి వస్తువులు డెలివరీ చేస్తున్నాడు. అందుకు గల కారణం అక్కడ పొగ మంచు విపరీతంగా కమ్ముకున్నది. అక్కడ అసల వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు.

దీంతో వినియోగదారులకు ఎలాగైన సరుకులు డెలివరీ చేయాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఓ కొరియర్ బాయ్ ఇలా గుర్రం మీద వెళ్లి ఆర్డర్లు ఇచ్చేసి వస్తున్నాడు. అయితే ఫొటో జర్నలిస్ట్ ఉమర్ గనీ ఈ వీడియోను సోషల్ మీడియాలో తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ఫు మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. అయితే కొరియర్ బాయ్ తెలివిని నెటిజన్లు అంతా ప్రశంసిస్తున్నారు. కొరియర్ బాయ్ మీడియాతో మాట్లాడుతూ నాకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ప్పుడు చలి కాలం కావడంతో ఇక్కడ మంచు బాగా కమ్ముకున్నది. దీంతో వాహనాలు వెళ్లడం చాలా ఇబ్బందికరంగా మారింది. అందుకే ఇలా గుర్రం మీద వెళ్లి డెలివరీ ఇస్తున్నాను అంటూ కొరియర్ బాయ్ చెప్పాడు.

వైరల్ : గుర్రంపై వెళ్లి పార్సెల్స్ డెలివరీ…ఎక్కడంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts