బ్రేకింగ్‌: ఏపీ స‌ర్కార్‌కు సుప్రీం షాక్‌.. పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నెల్‌!

January 25, 2021 at 2:47 pm

సుప్రీం కోర్టులో ఏపీ స‌ర్కార్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు ఏం చెప్పబోతుంది? ఎలక్షన్‌కు బ్రేకులా? ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నలా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వ‌చ్చేసింది.క‌రోనా నేప‌థ్యంలో ఎన్నికలు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో నేడు విచార‌ణ జ‌రిగింది.

జ‌స్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు విన్న‌ అనంత‌రం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లనూ తోసిపుచ్చిన కోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల వాయిదా కుదరదని, ఏపీలో స్థానిక ఎన్నికలు యథావిధిగా జరపాలని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఇక ఈ సందర్భంగా ధర్మాసనం ఉద్యోగ సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులు పనిచేయకుండా, పిటిషన్ వేయడం ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వెలిబుచ్చింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించింది. ఉద్యోగుల ప్రవర్తన పూర్తి అసంతృప్తికరంగా ఉందని తెలిపింది. ఇక తాజా తీర్పుతో ఏపీ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియ‌ర్ అయింది.

బ్రేకింగ్‌: ఏపీ స‌ర్కార్‌కు సుప్రీం షాక్‌.. పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నెల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts