అభిమాని పెళ్లిలో హీరో సూర్య సందడి..!!

January 25, 2021 at 2:15 pm

అందరికి తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించినప్పుడే నిజమైన సంతృప్తి. ఎంతో కష్ట పడి తీసిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తేనే హీరోకు ఆనందం. తనని ఇంకా తన చిత్రాలను ఎప్పటికప్పుడు ఆదరిస్తూ ఉండే అభిమానులంటే హీరోలకు ఎప్పుడు అభిమానమే. ముఖ్యంగా తమిళ స్టార్‌ హీరో సూర్య ఎప్పుడూ తన అభిమానుల పై తనకున్న ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. తాజాగా ఆయన ఓ అభిమాని వివాహానికి వెళ్లి ఆశీర్వదించాడు. సూర్య వీరాభిమాని, ఆలిండియా సూర్య ఫ్యాన్‌ క్లబ్‌ సభ్యుడు హరికి వివాహం కుదిరింది.

ఈ సంగతి తెలుసుకున్న సూర్య పెళ్లి సమయానికి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. వధువు మెడలో కట్టే తాళి బొట్టును స్వయంగా తన చేతులతో పెళ్లి కొడుక్కు అందించాడు సూర్య. అనంతరం వధూవరులను మనసారా ఆశీర్వదించాడు. సూర్య తన బిజీ షెడ్యూల్‌ను సైతం పక్కన పెట్టి మరీ తన వివాహానికి విచ్చేయడంతో సదరు అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబైయ్యాడు. ఇక పెళ్లి మండపంలో సూర్య సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అభిమాని పెళ్లిలో హీరో సూర్య సందడి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts