నాగ‌శౌర్య బ‌ర్త్‌డే.. అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన `వ‌రుడు కావ‌లెను` టీమ్‌!

January 22, 2021 at 11:13 am

టాలీవుడ్ యంగ్ & హ్యాడ్స‌మ్‌ హీరో నాగ‌శౌర్య తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌కు జోడీగా రీతువ‌ర్మ న‌టిస్తోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Happy Birthday Naga Shaurya From Varudu Kaavalenu Team

అయితే నేడు నాగ‌శౌర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ న్యూ పోస్ట‌ర్‌తో పాటు స‌ర్‌ప్రైజింగ్ వీడియోను కూడా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. సిక్స్ ప్యాక్ బాడీపై షర్ట్, దానికి సరిపోయే బ్లేజర్, మేచింగ్ వాచ్, కళ్లజోడును ధరించడాన్ని ఈ వీడియోలో హైలైట్ చేశారు. చివ‌రిగా స్టైలిష్ లుక్‌తో నడుచుకుంటూ వస్తున్న నాగశౌర్యను పరిచయం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే ఈ వీడియోలో 2021 మే నెలలో చిత్రం విడుదల అవుతుందన్న విషయం కూడా తెలుస్తుంది. ఇక ఈ స్పెష‌ల్‌ వీడియోకు చిత్ర సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. మొత్తానికి `వ‌రుడు కావ‌లెను` నుంచి వ‌చ్చిన ఈ వీడియో మాత్రం అదిరిపోయింద‌ని చెప్పాలి. మ‌రి దానిపై మీరు ఓ లుక్కేసేయండి.

నాగ‌శౌర్య బ‌ర్త్‌డే.. అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన `వ‌రుడు కావ‌లెను` టీమ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts