
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి ఏడు నెలలు గడిచాయి. సుశాంత్ కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ 30 ఏళ్లలో రాసుకున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖను ఆయన సోదరి శ్వేతా సింగ్ బుధవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. బాయ్ రాసుకున్న లేఖ. ఆయన ఆలోచనలు చాలా లోతైనవి అంటూ ఆమె షేర్ చేసుకున్నారు. నా జీవితంలో ఇప్పటికే 30 ఏళ్లు గడిపాను. ఈ మొదటి 30 ఏళ్లను ఇలా ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా శ్రమ పడ్డాను. ఇందుకోసం నా ప్రతి పనిలో మంచిగా ఉండాలని కోరుకున్నాను. అలాగే టెన్నిస్, స్కూల్, చదువు, ర్యాంక్స్లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను.
ప్రస్తుతం ఈ లేఖ పై నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. సుశాంత్ జీవితంపై ఎన్నో ఆశలతో రాసుకున్న ఈ లేఖ చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి మనకి తెలిసిందే. కానీ తన కొడుకును ఆత్మహత్యకు ప్రేరెపించేలా నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలు ప్రవర్తించారని ఆరోపిస్తు సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు అనంతరం ఈ కేసు విచారణకై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోకు అప్పచెప్పింది. ఈ క్రమంలో ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూడటంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఎన్సీబీ అధికారులు సమన్లు అందజేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియాను పోలీసులు సెప్టెంబర్లో అరెస్టు చేసి జైలుకి తరలించగా ఇటీవలే ఆమెకు బెయిల్పై విడుదలైయ్యారు.