క్రికెట‌ర్‌గా క‌నిపించేందుకు క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టిన తాప్సి..!!

January 28, 2021 at 2:43 pm

తెరపై తాము నటించే పాత్ర‌కు న్యాయం చేకూర్చే హీరోయిన్స్ లో తాప్సీ కూడా ఒక‌రు. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి తెలుగు, త‌మిళంలో పెద్దగా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో బాలీవుడ్ కి వెళ్ళింది. అక్క‌డ పలు ప్ర‌యోగాత్మ‌క‌ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది. ఇటీవ‌ల ర‌ష్మీ రాకెట్ అనే మూవీ షూటింగ్‌లో పాల్గొన్న తాప్సీ అందులో అథ్లెట్‌గా కనిపించనుంది. దానికోసం ఓ వైపు జిమ్‌లో క‌స‌ర‌త్తులు ఇంకో వైపు ర‌న్నింగ్ రేసుల‌లో పాల్గొంటూ అథ్లెట్‌గా త‌నని తాను మ‌లచుకుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ‌ర్క‌వుట్ ఫొటోస్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన అందరికిని ఆశ్చర్య పరుస్తుంది తాప్సి.

ప్ర‌స్తుతం భార‌త మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ‌యోపిక్‌లో న‌టిస్తుంది తాప్సీ. శభాష్‌ మిథూ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రికెట‌ర్‌గా క‌నిపించేందుకు క‌స‌ర‌త్తులు షురూ చేసింది. కోచ్ పర్య‌వేక్ష‌ణ‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న తాప్సి త‌న ప్రాక్టీసుకు సంబంధించిన పిక్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

క్రికెట‌ర్‌గా క‌నిపించేందుకు క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టిన తాప్సి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts