మ‌రోసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న త‌మ‌న్నా?

January 19, 2021 at 11:12 am

త‌మ‌న్నా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కొంచెం ఇష్టం కొంచెం కష్టం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన త‌మ‌న్నా ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన తమన్నా.. మ‌రోవైపు హిందీ, త‌మిళ చిత్రాల్లో కూడా న‌టించి సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ త‌మిళ సినిమా నుంచి త‌మ‌న్నాకు సూప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. కోలీవుడ్ స్టార్ ధనుశ్ హీరోగా అతని సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం పేరు ‘నాన్ వారువేన్స‌. గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించేందుకు త‌మ‌న్నాను సంప్ర‌దించార‌ట చిత్ర యూనిట్‌.

ఇక క‌థ విన్న త‌మన్నా.. ఏ మాత్రం ఆలోచించ‌కుండా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింద‌ని కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగోతంది. కాగా, గతంలో త‌మ‌న్నా, ధనుష్‌ ‘పడిక్కాదవన్‌’ (2009), ‘వేంగై’ (2011) చిత్రాల్లో జంటగా నటించారు. మ‌రి తాజా ప్ర‌చారం నిజ‌మైతే పదేళ్ల గ్యాప్ త‌ర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జ‌త‌క‌ట్టిన‌ట్టు అవుతుంది.

మ‌రోసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న త‌మ‌న్నా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts