ఆ విష‌యంలో చీటింగ్ చేస్తున్న తమన్నా… ఫొటోలు వైర‌ల్‌!

January 16, 2021 at 9:48 am

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కొంచెం ఇష్టం కొంచెం కష్టం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన త‌మ‌న్నా.. ఆ త‌ర్వాత వ‌రుస మూవీతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అందం, అభినయంతో ఆక‌ట్టుకొంటూ గ‌త కొన్నేళ్లుగా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా త‌మ‌న్నా దూసుకుపోతోంది.

అలాంటి త‌మ‌న్నా తాజాగా ఓ చీటింగ్ చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. సాధార‌ణంగా ఏది పడితే.. అది తింటే లావైపోతారే భయం హీరోయిన్స్‌కు ఉంటుంది. అందుకే డైట్ విష‌యంలో హీరోయిన్లు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. కానీ తమన్నా మాత్రం అపుడుపుడు డైట్ విషయంలో చీటింగ్ చేస్తూ ఉంటుందట.

తాజాగా త‌మ‌న్నా తన చీటింగ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. డైటింగ్‌కు స్వస్తి చెప్పి ఇష్టమైనవన్నీ తింటున్నట్టు తెలిపింది. చీట్ మీల్ అంటూ బర్గర్లు, పిజ్జాలు, కొవ్వు పదార్ధాలను ఎంచక్కా తింటూ ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. కాగా, త‌మ‌న్నా ప్ర‌స్తుతం గోపిచంద్ `సీటీమార్`, నితిన్ ‘అంధాదున్’ రీమేక్‌లో న‌టిస్తోంది.

ఆ విష‌యంలో చీటింగ్ చేస్తున్న తమన్నా… ఫొటోలు వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts