కుర్రకారు మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..!!

January 13, 2021 at 1:14 pm

నటి నటులు త‌మ ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు త‌ర‌చు వ‌ర్క‌వుట్స్ చేయ‌డం సహజం. ఇటీవల మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కూడా ఇదే బాటలో నడుస్తుంది. ఎల్లప్పుడూ స్లిమ్‌గా మంచి ఫిగర్ తో క‌నిపించేందుకు రెగ్యుల‌ర్‌గా వ‌ర్క‌వుట్స్ చేస్తూ వ‌చ్చిన త‌మ‌న్నా, క‌రోనా వ‌ల‌న గత కొద్దినెలలు బాగా గ్యాప్ ఇచ్చింది. తరచూ వ‌ర్క‌వుట్స్ చేసే వాళ్ళు మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ తీసుకుంటే లావు అవ్వటం స‌హజ‌మే.

మెడికేష‌న్‌లో భాగంగా 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మెడిసిన్ వాడ‌డం వ‌ల‌న తమన్నా లావైపోయింది. ఇప్పుడు మరలా పాత రూపంలోకి మారేందుకు త‌మ‌న్నా జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తుంది. తాజాగా త‌మ‌న్నా చేస్తున్న వ‌ర్క‌వుట్స్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసి నెటిజ‌న్స్ వావ్ తమ్ము అంటున్నారు. ప్ర‌స్తుతం తమన్నా సీటీమార్, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3 సినిమాల కోసం సిద్ధం అవుతోంది.

కుర్రకారు మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts