
జూబ్లీ హిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం నాడు అర్ధరాత్రి ఓ యువతి మద్యం మత్తులో హల్చల్ చేసింది. రహ్మత్ నగర్ పోలీస్ అవుట్ పోస్టు దగ్గర లోని పార్కు వద్ద ఓ యువతీ నగ్నంగా చిందు లేసింది. ఇది గమనించిన అవుట్ పోస్టు మహిళా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెకు దుస్తులు వేసి ఆ తర్వాత కొంత సేపటికే వాటిని కూడా ఆ యువతి చింపి పారేసింది. దీంతో మరొకసారి పోలీసులు ఆమెకు దుస్తులు అందించారు.
హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన తన ప్రియుడు భరత్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి వాపోయింది. దీంతో తాను ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు ఆ యువకుడికి ఫోన్ చేసి చెప్పింది. అనంతరం ఈ చర్యకు ఆమె ఇలా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువతికి మద్యం మత్తు దిగే వరకు తనకి ఆశ్రయం ఇచ్చి పోలీసులు ఆ తరువాత ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.