
దర్శకుడు వర్మ తెరకెక్కించిన ఐస్‌క్రీమ్‌తో సినిమాతో తనపై ద్రుష్టి తిప్పుకున్న తేజస్వీ ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని హౌస్‌లో అందాలు ఆరబోస్తూ అందరి హృదయాలు దోచుకుంది. అయితే హౌజ్‌లో ఆమె ప్రవర్తన వలన పెద్దగా ఆఫర్స్ రాకపోవటంతో, దీంతో చేసేదేం లేక హాట్ ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తూ వస్తుంది.
ప్రస్తుతం కమిట్మెంట్ అనే చిత్రం చేస్తున్న తేజస్వీ ఈ చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచు కోవాలని ఆశిస్తుంది. ఈ మూవీ అమ్మాయిల మీద జరిగే ఘోరాల నేపథ్యంలో రూపొందనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేసాయి. ఇందులో చాలా బోల్డ్ గా కనిపించనున్న తేజస్వీ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి షేర్ చేసింది. ఆ ఫొటోలో అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతుంది.