చిరుతో కలిసి నటించడం నా అదృష్టం: తమన్

January 20, 2021 at 4:39 pm

ఆచార్యచిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి మలయాళ చిత్రం లూసిఫర్‌ రీమేక్‌లో నటించనున్న సంగతి అందరికి తెలిసిందే. దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా త్వరలోనే షూటింగ్‌ లాంఛనంగా మొదలు కానుంది. ఇక ఈ చిత్రానికి ఇప్పటి వరకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు అనే విషయం ఇంకా ఖరారు కాలేదు. అయితే తాజాగా మెగాస్టార్‌ చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని తమన్‌ కి దక్కింది. లూసిఫర్‌కు తాను స్వరాలు సమకూర్చే ఛాన్స్‌ దక్కించుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించాడు థమన్. చిరంజీవి సినిమాకు తాను మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం పెద్ద అదృష్టంగా తమన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు థమన్. ప్రతి కంపోజర్‌కు ఇది చాలా పెద్ద కల. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది.

మెగాస్టార్‌ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటు కునేందుకు టైం వచ్చింది. లూసిఫర్‌ మ్యూజికల్‌ జర్నీ ఇప్పుడు ప్రారంభం కానుంది. మోహన్‌ రాజాకి నా కృతజ్ఞతలు అంటూ తమన్‌ తన ట్విట్టర్ లో ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా లూసిఫర్‌ చిత్రం ప్రకటించినప్పటి నుంచి చిరు అభిమానుల్లో హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ మూవీకి తెలుగులో బైరెడ్డి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు వినికిడి. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య మూవీ షూటింగ్‌ వేగంగా జరుపుకోంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చందమామ ఫేమ్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ విలన్‌గా కకనిపించనున్నారు. రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో అలరించనన్నాడు. ఈ సినిమా అనంతరం లూసిఫర్‌ షూటింగ్‌లో చిరు జాయిన్‌ కానున్నాడు.

చిరుతో కలిసి నటించడం నా అదృష్టం: తమన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts