
టాలీవుడ్ లో అందాల భామ, ప్రముఖ యాంకర్ అనసూయ ఒక వైపు యాంకర్‌గా బుల్లితెర పై అలరిస్తూనే అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కు మంటూ మెరిసి ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. క్షణం, రంగస్థలం, రంగమార్తాండ వంటి సినిమాలు చేసిన అనసూయ ప్రస్తుతం థ్యాంక్ యు బ్రదర్ అనే చిత్రం చేస్తుంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి రూపొందిస్తున్నారు.
ఈ రోజు విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్. సాయంత్రం 4.05ని.లకు ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యు బద్రర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.