
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ఇంకా మాటలు అందిస్తున్నారు. జనవరి 25 నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు మూవీ మేకర్స్.
తాజాగా రిలీజ్ అయిన వీడియోలో పవన్ లొకేషన్లో అడుగుపెట్టడం, చిత్ర దర్శకుడు, త్రివిక్రమ్‌తో చర్చలు చేయడం ఫైనల్‌గా బుల్లెట్‌పై వెళ్లడం వంటి సన్నివేశాలు చూపించారు. ఈ చిత్రంలో సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ బాణీలు సమకూరుస్తున్నారు.