విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ టైటిల్ విడుదల అప్పుడేనట …!?

January 17, 2021 at 3:19 pm

గత కొంతకాలంగా కరోనా మహమ్మారీ వల్ల విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. విజయ్ పూరి టీమ్ దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. తాజాగా పూరి సన్నిహితుల నుంచి ట్విస్టిస్తూ ఊహించని ప్రకటన వెలువడింది. భాషతో సంబంధం లేకుండా హద్దులు చెరిపేస్తూ మూవీని ఒకటిగా తెస్తున్నాం అంటూ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ ని ఆవిష్కరిస్తున్నామని వారు ప్రకటించింది. రేపు అంటే సోమవారం నాడు ఉదయం 10గం.8 నిమిషాలకు టైటిల్ ఏమిటన్నది రివీల్ కానుంది. ఈ సినిమాని కరణ్ జోహార్ ధర్మ మూవీస్ తో కలిసి పూరి కనెక్ట్స్ పూరి-ఛార్మి నిర్మిస్తోంది. ఈ సినిమాలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.

బాక్సింగ్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలోని ఈ చిత్రం కోసం విజయ్ భారీగా కండలు పెంచి 6 ప్యాక్ ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి విజయ్ బృందం నుండి టాలీవుడ్ టు బాలీవుడ్ లో మరో సెన్సేషన్ గ్యారెంటీ అని అంటున్నారు. కమర్షియల్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ ఇచ్చిన గురువుగా పూరి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చెయ్యనున్నారు అన్నది వేచి చూడాల్సిందే. గత కొంతకాలంగా హద్దులు చెరిపేస్తూ ఇన్నోవేటివ్ కధలతో అన్ని భాషలకు సరిపడే చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో మరో కొత్త చాప్టర్ ని పరిచయం చేస్తాం అని అంటున్నారు పూరి కనెక్ట్స్ గట్టిగానే ప్రకటించింది. కాబట్టి పూరి విజయ్ కాంబినేషన్ లో రానున్న ఈ మూవీ ఇంకా సినీ బృందం కాన్ఫిడెన్స్ చూస్తుంటే అటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటూ అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ టైటిల్ విడుదల అప్పుడేనట …!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts