నార‌ప్ప డైరెక్ట‌ర్ కొత్త చిత్రం ఇదే..!

January 22, 2021 at 4:04 pm

టాలీవుడ్ ప్రముఖ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల ప్ర‌స్తుతం విక్టరీ వెంకటేశ్ తో నార‌ప్ప చిత్రాన్ని చేస్తున్నాడు. రూర‌ల్ యాక్ష‌న్ డ్రామాగా వ‌స్తోన్న ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి ఫీమేల్ లీడ్ గా చేస్తుంది. స‌మ్మ‌ర్ స్పెషల్ గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేక‌ర్స్. ఇదిలా ఉంటే డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ ఫిక్స అయింది. ప్ర‌ముఖ నిర్మాత‌, ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల కొడుకు హీరోగా పరిశ్రమకు ప‌రిచ‌యం చేయ‌నున్నాడు. ఈ చిత్రానికి కూచిపూడి వారి వీధిలో అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్టు సినీ వ‌ర్గాల టాక్‌. గీతాఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై బ‌న్నీవాసు ఈ సినిమాని నిర్మించ‌నున్నారు.

గోదావ‌రి ప్రాంతం నేప‌థ్యంలో నడిచే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల‌. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. త‌మిళంలో హీరో ధ‌నుష్ చేసిన అసుర‌న్ ను తెలుగులో నార‌ప్ప టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పంద‌నే వ‌చ్చింది.

నార‌ప్ప డైరెక్ట‌ర్ కొత్త చిత్రం ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts