టాలీవుడ్ తెలుగు అమ్మాయి అంజలి.. ఇలా మారిందేంటి !

January 26, 2021 at 2:38 pm

టాలీవుడ్ సిని ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిగా పరిచయమైన అంజలి ఇటు తెలుగులోనే కాకుండా అటు కోలీవుడ్ లోనూ రాణిస్తోంది. ప్ర‌స్తుతం అంజ‌లి మూవీస్ తో పాటు ఓటీటీలో ప్ర‌సార‌మ‌వుతున్న వెబ్ సిరీస్‌ల‌లోను న‌టిస్తుంది. రీసెంట్ గా వకీల్ సాబ్ చిత్రంలో ఒక ప్రముఖ పాత్రలో నటించింది అంజలి. అయితే ఎంతో బొద్దుగా క‌నిపించే ఈ ముద్దు గుమ్మ ఇటీవల కాలంలో చాలా సన్నగా నాజూకుగా మారింది.

సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే అంజలి తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసే సరికి తన అభిమానులు అంతా తెగ పరేషాన్ అయ్యారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చాలా హోమ్లీగా , ఆచం పక్కింటి తెలుగమ్మాయిగా ఆకట్టుకున్న అంజలి ప్రస్తుతం సన్నజాజి తీగలా మారి, హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు లో హీట్ పుట్టిస్తోంది. రీసెంట్ గా నిశ్శబ్ధం చిత్రంలో నటించిన అంజలి ఇప్పుడు గ్లామర్ పాత్ర‌ల‌కు కూడా పచ్చ జెండా ఊపుతుందట.

టాలీవుడ్ తెలుగు అమ్మాయి అంజలి.. ఇలా మారిందేంటి !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts