
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదని అందరికి తెలిసిన సంగతి. ప్రస్తుతం తన అంచనాలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్.
కానీ తాజాగా అఖిల్ కోసం తన వదిన అయిన టాలీవుడ్ నటి సమంత ఓ క్రేజీ ప్రాజెక్టును సెట్ చేసి పెట్టిందని టాక్. సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసిన రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి సంయుక్తంగా ఈ సినిమాని చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో సమంత ఓ కీలక పాత్రలో నటిస్తుంది. రాజ్, కృష్ణ డీకే నటి సమంతకు ఓ కథ వినిపించగా ఈ ప్రాజెక్టుకు సామ్ అఖిల్ పేరును సూచించినట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ మూవీని అశ్వినిదత్ నిర్మించనున్నట్టు వినికిడి.