శృతి హాసన్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనా…!?

January 28, 2021 at 4:29 pm

టాలీవుడ్ అందాల నటి శృతిహాస‌న్ తాజాగా తాను ప్రేమ‌లో ఉన్న విషయం ఇటీవ‌లే తన అభిమానులతో చేసిన చిట్‌ చాట్‌లో బ‌య‌ట‌పెట్టిన విషయం తెలిసిందే. ఒక్క నెటిజెన్ శ్రుతిని ప్రేమ‌లో ఉన్నారా అని అడగ‌గా తన అభిమానుల ఊహ‌లు, అనుమానాలకు తెరతీస్తూ అవును నేను ప్రేమ‌లో ఉన్నాను అంటూ చెప్పింది శృతిహాస‌న్. ఈ స‌మాధానంతో శృతిహాస‌న్ లవర్ ఎవ‌రై ఉంటారా అంటూ ఆమె ఫాలోవ‌ర్లు, అభిమానులు చర్చ మొదలు పెట్టారు.

ఇప్పుడు తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ ఫొటోలు చూస్తే ఫాలోయర్స్ కి పూర్తి క్లారిటీ వ‌స్తుంది. ఇంకా శృతిహాస‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ డూడుల్ ఆర్టిస్ట్‌ సాంత‌ను హ‌జారికా ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఇతడు ముంబైలో శృతిహాసన్ తో ప్రీ బ‌ర్త్ డే లంచ్ డేట్ కి కూడా హాజరయ్యాడు. తాజాగా శృతికి విషెస్ చెప్తూ హ‌గ్ చేసుకున్న ఫోటో ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు సాంత‌ను హ‌జారికా. దీనితో శృతి, సాంత‌ను హ‌జారికా ప్రేమ‌లో పడినట్లు నెటిజ‌న్లు అంతా కామెంట్లు పెట్ట‌డం షురూ చేసారు.

శృతి హాసన్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts