అలీ సినిమాలో వాళ్ళిద్దరూ నటిస్తున్నారు..!!

January 22, 2021 at 3:45 pm

అలీ నిర్మాతగా అలీవుడ్‌ ఎంటర్‌ టైన్మెంట్స్‌ పతాకాంపై తెరకెక్కుతున్న సినిమా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. అలీ, విజయ కృష్ణానరేశ్‌ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నటిస్తుండటం ఈ సినిమాకి మరో విశేషం. ఇప్పటి వరకు తెరవెనక ఉంటూ ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలని తెలుగు చిత్రసీమకు అందించిన ఈ దిగ్గజాలు మొదటి సారిగా వెండితెర మీద మెరవ నున్నారు.

గతంలో ఎస్వీ కష్ణారెడ్డి పలు చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ, అచ్చిరెడ్డిగారితో కలిసి నటించడం ఇదే ప్రధమం. అలీని హీరోగా పరిచయం చేసి, ఆయన కెరీర్‌ని ఓ కీలక మలుపు తిప్పిన అచ్చిరెడ్డి – కష్ణారెడ్డి ఇప్పుడు అలీ కోరిక మేరకు ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో వారిద్దరి పాత్ర చిన్నదైనప్పటికీ నా మీద అభిమానంతో నటించడానికి అంగీకరించారు అంటూ చెప్పారు అలీ. తాజాగా జరిగిన షెడ్యూల్‌లో అచ్చిరెడ్డి , కృష్ణారెడ్డి మీద కొన్ని ముఖ్య సన్నివేశాల్ని చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్‌ చిత్రీకరించారు. ఈ చిత్రం మలయాళ బ్లాక్‌ బస్టర్‌ సినిమా వికృతికి రీమేక్‌గా తెరక్కెకుతుంది.

అలీ సినిమాలో వాళ్ళిద్దరూ నటిస్తున్నారు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts