
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న చిత్రం `ఉప్పెన`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ చిత్రం కృతి శెట్టి హీరోయిన్గా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
ఇక ఎప్పుడో ఈ చిత్రం విడుదల కావాల్సిన ఉన్నా.. కరోనా అడ్డుపడింది. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దీంతో ఉప్పెన ఎప్పుడు తీరాన్ని తాకుతుందా అని ప్రేక్షకులకు ఎన్నో ఆశలతో చూస్తున్నారు. ఇప్పుడు ఆ టైమ్ దగ్గర పడుతున్నట్టు తెలుస్తోంది.
అందమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాను ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. లవర్స్ డే కానుకగా పిబ్రవరి 14న సినిమాని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. కాగా, విడుదలకు ముందు సాంగ్స్‌తో, టీజర్‌తో పలు రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.