
ప్రపంచదేశాలను అతలాకుతలం చేసిన ప్రాణాంతక వైరస్ కరోనా అంతానికి టైమ్ దగ్గర పడుతోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనాను నాశనం చేసేందుకు ప్రభుత్వాలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా భారత్‌లో వైరస్‌పై పోరు కోసం సిద్ధమైన టీకా పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం పదిన్నర గంటలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే తెలంగాణలో తొలి రోజు 140 కేంద్రాలలో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా తొలిరోజు 4,170 మంది టీకా వేయనున్నారు.
అయితే ఇదివరకు కరోనా వ్యాక్సిన్ వేసుకొని అలర్టీల వంటివి వచ్చిన వారు ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకూడదు. గర్భిణీలు, ఈమధ్యే పిల్లల్ని కన్న తల్లులు, గర్భం ఉందో, లేదో తెలియని మహిళలు కూడా ఈసారికి టీకా వేయించుకోకూడదని కేంద్రం సూచించింది.