అఖిల్ కొత్త మూవీలో బీటౌన్ బ్యూటీ..!!

January 24, 2021 at 2:50 pm

అక్కినేని కుటుంబం నుండి వచ్చిన యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం వరుస చిత్రాలను లైన్‌లో పెట్టి బిజీగా ఉన్నాడు. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో స్పైగా అఖిల్ కనిపించనున్నాడట. అయితే ఇందులో అఖిల్ సరసన నటించేది ఎవరి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో తాజాగా బీటౌన్ బ్యూటీ పేరు తెగ వినిపిస్తోంది.

కొత్త హీరోయిన్‌ కోసం వెతుకుతున్న సురేందర్ బాలీవుడ్‌ వైపు వెతికి ఎట్టకేలకు అక్కడ కనిపించిన ఓ మోడలింగ్ భామని చూసి దర్శకుడు ఫిదా అయిపోయాడట. దాంతో వెంటనే ఆ అమ్మడిని ఫిక్స్ చేశాడు. ఆమె పేరు వైద్య సాక్షి, ప్రస్తుతం బాలీవుడ్ మోడలింగ్‌లో రాణిస్తోంది. అమెనే అఖిల్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకురానున్నారని సమాచారం. ఆమె చేసిన యాడ్స్‌ను, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోలను చూసి సురేందర్ రెడ్డి ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చె నెలలో మొదలుకానుంది.

అఖిల్ కొత్త మూవీలో బీటౌన్ బ్యూటీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts