తండ్రి వ‌ల్ల‌ ఆ స్టార్ డైరెక్ట‌ర్ సినిమాను వ‌దులుకున్న వరలక్ష్మి!

January 22, 2021 at 9:36 am

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులకు సుప‌రిచితులైన హీరో శ‌ర‌త్‌కుమార్ కుమార్తెనే ఈ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. ఏ విష‌యంలో అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ‌ర‌ల‌క్ష్మి.. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా న‌టించినా ప్ర‌స్తుతం మాత్రం విల‌న్ పాత్ర‌లు పోషిస్తూ దూసుకుపోతోంది.

ఇటీవల కాలంలో లేడీ విలన్ అవసరమైతే అందరికి గుర్తొచ్చే మొదటిపేరు వరలక్మినే. ఇక ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన `క్రాక్‌` చిత్రంలో కూడా వ‌ర‌ల‌క్ష్మి విల‌న్ పాత్ర పోషించ‌డ‌మే కాదు.. విమ‌ర్శ‌కుల చేత ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వ‌ర‌ల‌క్ష్మి ప‌లు ఆస‌క్తిక విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకుంది.

ఈ క్ర‌మంలోనే త‌న తండ్రి కార‌ణంగా ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ చేసిన సూప‌ర్ హిట్ సినిమాను వ‌దులుకున్న‌ట్టు కూడా తెలిపింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శంకర్ దర్శకత్వంలో హీరో సిద్ధర్థ్ నటించిన బాయ్స్ సినిమాలో హీరోయిన్ గా మొదట వరలక్ష్మిని ఎంపిక చేశారట. అయితే ఆ సమయంలో ఆమె వయసు 17 సంవత్సరాలు. అంత చిన్న వయసులో యాక్టింగ్ వద్దని తన తండ్రి శరత్ కుమార్ చెప్పార‌ట‌. ఇక తండ్రి మాట కాద‌న‌లేక‌.. వర‌ల‌క్ష్మి శంక‌ర్ సినిమాను వ‌దులుకుంద‌ట‌.

తండ్రి వ‌ల్ల‌ ఆ స్టార్ డైరెక్ట‌ర్ సినిమాను వ‌దులుకున్న వరలక్ష్మి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts