వరుణ్‌తేజ్‌ 10వ సినిమా ఫస్ట్‌లుక్‌కు డేట్ లాక్‌!

January 17, 2021 at 9:58 am

మెగా పిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` సినిమా చేస్తూనే.. మ‌రో సినిమాను కూడా ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేవ్‌, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.

బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి సూప‌ర్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌కు డేట్ లాక్ చేశారు చిత్ర‌ యూనిట్‌.

వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో ప‌దో చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 19వ తారీకున ఉదయం 10గంటల 10నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బాక్సింగ్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు చేతులకు క్లాత్ కట్టుకుంటూ ఉన్న ఈ పోస్టర్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

వరుణ్‌తేజ్‌ 10వ సినిమా ఫస్ట్‌లుక్‌కు డేట్ లాక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts