
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. చేసిన తక్కువ సినిమాలే అయినా యమా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్కో సినిమాలోనూ ఒక్కో విభిన్నమైన పాత్ర పోషిస్తూ.. విలక్షణ నటుడు అనిపించుకున్నాడు వరుణ్. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం తన 10వ సినిమాగా బాక్సింగ్ డ్రామాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో రెనాయిసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్ధు ముద్ద, అల్లుబాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు వరుణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా వరుణ్ పదో చిత్రం నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశాడు.
ఈ సినిమాకు `గనీ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్‌కు తగ్గట్టే వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. ఈ పోస్టర్లో వరుణ్ బాక్సింగ్ చేస్తూ ఎనర్జిటిక్ లుక్‌లో కేకపెట్టిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ ఫస్ట్ లుక్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటింస్తుండగా.. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.