ప‌వ‌న్ నిర్మాణంలో వరుణ్ సినిమా.. కానీ, అదొక్క‌టే స‌మ‌స్య‌?

January 11, 2021 at 8:15 am

ఎఫ్‌2, గద్దలకొండ గణేష్ వంటి మంచి విజ‌యాల‌ త‌ర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరే సినిమా ప్ర‌క‌టించకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈయ‌న అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్‌3లో వెంక‌టేష్‌తో పాటు మ‌రో హీరోగా న‌టించనున్నారు. అలాగే బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఓ చిత్రం కూడా వ‌రుణ్ న‌టిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. వ‌రుణ్‌కు సంబంధించి మ‌రో వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ వార్త ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్యానర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా రాబోతుందట‌. రచయిత కోన వెంకట్ అందించిన కథతో ఈ సినిమా త్వ‌ర‌లోనే తెర‌కెక్క‌బోతుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

అయితే ఈ సినిమాకు ఇంకా ద‌ర్శ‌కుడు దొర‌క్క‌పోవ‌డం ఒక్క‌టే స‌మ‌స్య‌గా మారింద‌ట‌. ద‌ర్శ‌కుడు దొరికిన వెంట‌నే.. ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. కాగా, ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డ్డ వ‌రుణ్ తేజ్‌.. మళ్లీ ఆ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ నిర్మాణంలో వరుణ్ సినిమా.. కానీ, అదొక్క‌టే స‌మ‌స్య‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts