`ఆచార్య‌` కోసం రంగంలోకి దిగిన వ‌రుణ్ తేజ్‌.. వైర‌ల్‌‌గా పోస్ట్‌!

January 28, 2021 at 8:49 am

మెగా స్టార్ చిరంజీవి హీరోగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక మ‌రో కీల‌క పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌నున్నాడు.

అయితే ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌కు డేట్ లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 4.05కు విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దీంతో టీజ‌ర్ ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాడు.

ఇలాంటి త‌రుణంలో ఈ సినిమా టీజ‌ర్‌పై మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ రంగంలోకి దిగి ఓ కొత్త మీమ్‌ను పోస్ట్ చేశాడు. ‘చరణ్‌ అన్న వాయిస్‌ ఓవర్‌ అంటగా టీజర్‌కి.. బయట టాక్‌..’ అంటూ చిరంజీవి, రామ్‌చరణ్‌లను ట్యాగ్‌ చేస్తూ బ్రహ్మానందం ఫొటోతో తయారు చేసిన మీమ్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ఇక వ‌రున పోస్ట్ ప్ర‌కారం చూస్తే.. నిజంగా ఆచార్య టీజ‌ర్‌కు చెర్రీ వాయిస్ ఓవ‌ర్ ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

`ఆచార్య‌` కోసం రంగంలోకి దిగిన వ‌రుణ్ తేజ్‌.. వైర‌ల్‌‌గా పోస్ట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts