విజయ్‌ దేవరకొండకు బీర్‌తో ఫ్యాన్స్ అభిషేకం.. వైర‌ల్‌గా వీడియో!

January 19, 2021 at 10:50 am

సాధార‌ణంగా హీరోల‌కు వారి అభిమానులు పాలాభిషేకం చేయ‌డం ఎప్ప‌టికప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ, రౌడీ హీరో విజ‌య్ దేవ‌రకొండ అభిమానులు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. తాజాగా అభిమానులు పాల‌తో కాకుండా ఏకంగా బీర్‌తో విజ‌య్‌కు అభిషేకం చేశారు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ కరణ్ జోహార్, పూరి, ఛార్మి ముగ్గురు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజ‌య్‌కు జోడీగా అనన్య పాండే న‌టిస్తోంది. అయితే ఈ చిత్రానికి లైగ‌ర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు.. నిన్న టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఇక ఈ టైటిల్ పోస్ట‌ర్ చూసిన విజ‌య్ మ‌రియు పూరీ అభిమానుల్లో నూత‌నోత్సాహం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కొంద‌రు అభిమానులు విజయ్‌ దేవరకొండ ఫస్ట్‌లుక్‌కు బీరుతో అభిషేకం చేశారు. ఆ వీడియోను ఛార్మి తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. ‘రచ్చ మొదలైంది’ అంటూ మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేసింది ఛార్మి. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

విజయ్‌ దేవరకొండకు బీర్‌తో ఫ్యాన్స్ అభిషేకం.. వైర‌ల్‌గా వీడియో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts