ఫిబ్రవరి 12న ‘ఎఫ్.సి.యు.కె.’ విడుదల …!

January 18, 2021 at 3:50 pm

లైగర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నపేరు ఇది. అసలు లైగర్ అంటే ఏంటి అంటూ చాలా మంది గూగుల్ చేస్తునారు. ఈ సినిమాకి మొదట్లో ఫైటర్ అనే టైటిల్ అనుకున్నారు మళ్ళి ఉన్నట్లుండి లైగర్ అనే టైటిల్ రిలీజ్ చేసాడు పూరీ జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో వస్తున్న లైగర్ సినిమా కోసం అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. పైగా ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇదిలా ఉంటే లైగర్ అనే టైటిల్ చాలా వెరైటీ ఇంకా డిఫరెంట్ గా ఉంది.

ఫైటర్ విన్నాం టైగర్ విన్నాం కానీ లైగర్ అనే పదం చాలా కొత్తగా అనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఇదే టైటిల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అదే టైటిల్ రిలీజ్ చేసాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ కింద ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు పూరీ జగన్నాథ్. బాక్సింగ్ గ్లౌజ్‌లతో విజయ్ పిచ్చెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఉత్తరాది భామ అనన్య పాండే ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంది. ఇదిలా ఉంటే లైగర్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. దీనికి అర్థం ఉంది మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అని అంటారు. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ మూవీకి ఇదే పేరును ఫిక్స్ చేసారు.

ఫిబ్రవరి 12న ‘ఎఫ్.సి.యు.కె.’ విడుదల …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts