
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా నటిస్తోంది. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముందుగా ‘ ఫైటర్’ పేరు అనుకున్నారు.
కానీ, అప్పటికే ఈ టైటిల్‌ను వేరే వారు రిజిస్టర్ చేసుకోవడంతో.. ఈ చిత్రానికి టైటిల్‌ను మార్చారు. ఇక తాజాగా చిత్రబృందం తమ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించింది. ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) అని పూరి బృందం టైటిల్ ను ఫిక్స్ చేశారు. లైగర్ అంటే సింహం, పులికి పుట్టిన జంతువును లైగర్ అని పిలుస్తారు.
అలా హీరో క్యారెక్టర్లో పులి, సింహం ఫోటోలను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాయి. కాగా, తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం.. ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానున్నట్టు సమాచారం.