
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే.. ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. అందులో `సలార్` ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.
ఇక ఇటీవలె ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఎన్నడూ చూడని మాస్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ విజయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌తో ఓ స్టార్ హీరో విలన్‌గా తలపడనున్నాడట.
ఇంతకీ ఆయన ఎవరో కాదు.. తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అభిమానులకు పండగే అని చెప్పాలి. కాగా, విజయ్ సేతుపతి ఓవైపు హీరోగానే కాకుండా.. మరోవైపు విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.