కేటీఆర్ పట్టాభిషేకం పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!?

January 21, 2021 at 1:14 pm

కేటీఆర్‌ను సీఎం చేస్తారనే వార్తలు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అంటున్నారు. అయితే కేటీఆర్‌ పట్టాభిషేకంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించి, ఒకవైపు కేటీఆర్‌ను తెలంగాణ కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ గారు ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి గోదావరికి హారతులిచ్చి పూజాదికాలు నిర్వర్తించడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

మంగళవారం నాటి పర్యటనలో కాళేశ్వరం ఇంకా మిగిలిన ప్రాజెక్ట్‌లను కేసీఆర్ గారు ఆకాశాని కెత్తేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్న తరుణంలో ఇలా పాప పరిహారంగా నదీ తల్లికి మొక్కులు చెల్లించుకున్నట్టు కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేసారు. రైతాంగం, ప్రజల సంక్షేమం పట్ల వారికీ ఎంత చిత్తశుద్ది ఉందంటే ఈ ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులు ఉపాధి కోసం విజ్ఞప్తి చేసుకోవడానికి వస్తే కలుసుకునే తీరిక కూడా ఆయనకు లేదు పాపం అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

కేటీఆర్ పట్టాభిషేకం పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts