దిల్ రాజుపై `క్రాక్‌` డిస్ట్రిబ్యూటర్ ఫైర్‌.. కిల్‌ రాజు అంటూ విమ‌ర్శ‌లు!

January 15, 2021 at 9:32 am

దిల్ రాజు కాదు కిల్ రాజు.. అన్న‌ది ఎవ‌రో కాదు `క్రాక్‌` డిస్ట్రిబ్యూటరే. టాలీవుడ్‌లో బ‌డా నిర్మాత అయిన దిల్ రాజును అంత మాట అనాల్సి అవ‌స‌రం ఆయ‌న‌కు ఎందుకు వ‌చ్చిందా అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. సాధార‌ణంగా కొన్ని సందర్భాల్లో నిర్మాతల ఆధిపత్యమో, పరిస్థితుల కారణంగానో కొన్ని సినిమాలకు థియేటర్లు లభించవు.

ఈ కారణంగా కొన్ని సినిమాలు త‌క్కువ సమయంలోనే థియేటర్ల నుంచి వెనుదిరుగుతుంటాయి. ఇప్పుడు ర‌వితేజ హీరోగా వ‌చ్చిన `క్రాక్‌` చిత్రానికి కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ఈ క్ర‌మంలోనే వరంగల్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీను దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘క్రాక్’ సినిమాకు సరైన థియేటర్లు ఇవ్వలేదని ఆరోపించారు.

రవితేజ నటించిన ఈ సినిమాకు సూప‌ర్ హిట్‌ టాక్ వచ్చిన‌ప్ప‌టికీ.. దీనికి థియేటర్లు తగ్గించి, డబ్బింగ్ సినిమా అయిన విజయ్ నటించిన ‘మాస్టర్’కు ఎక్కువ థియేటర్లు కేటాయించారని అన్నారు. దిల్‌ రాజు పేరును కిల్‌ రాజుగా మార్చాల‌ని మండిప‌డ్డారు. గ‌తంలో సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బింగ్ సినిమాలకు ఎలా థియేటర్లు ఇస్తామని ప్ర‌శ్నించిన దిల్ రాజు ఇప్పుడు ఇలా చేయడం దారుణం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం శ్రీ‌ను చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.

దిల్ రాజుపై `క్రాక్‌` డిస్ట్రిబ్యూటర్ ఫైర్‌.. కిల్‌ రాజు అంటూ విమ‌ర్శ‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts