
ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీపై మరోకసారి అందరికి వివరణ ఇచ్చింది. యూజర్ల సందేశాలను ఎవరూ చదవలేరనీ, కాల్స్ కూడా ఎవరూ వినలేరని వాట్సాప్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ అమలు చేయనున్న కొత్త ప్రైవసీ పాలసీపై అందరిలో తీవ్ర గందరగోళం నెల కొనడంతో పాటు చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వైపు తరలుతున్న క్రమంలో వాట్సాప్ ఈ మేరకు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్త అప్డేట్ల వల్ల ప్రజల మెసేజస్ గోప్యతపై ఎలాంటి ప్రభావం పడబోదని సంస్థ స్పష్టం చేసింది. బిజినెస్ మెసేజింగ్‌కి సంబంధించి కీలక మార్పులతో పాటు తాజా అప్డేట్లో డేటా సేకరణ, వినియోగంపై మరింత పారదర్శకత వస్తుంది అని వాట్సాప్ తెలిపింది.
కాల్స్‌ని వినడంగానీ, మెసేజ్‌లు చదవడంగానీ తాము చేయబోమనీ తెలిపింది. అయితే వాట్సాప్ ఏ సమాచారాన్ని సేకరిస్తుందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం పైఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫేస్బుక్ ఖాతా తెరుస్తున్నప్పుడు ఎలాంటి సమాచారాన్ని ఇస్తామో అలాగే యూజర్ల నుంచి వాట్సాప్ సేకరించిన వివరాలని ఫేస్‌బుక్‌తో ఆటోమేటిగ్గా షేర్ చేసుకుంటుంది. వీటితో పాటు యూజర్ యాక్టివిటీని కూడా షేర్ చేసుకుంటుంది. అంటే వాట్సాప్‌ని ఎన్నిసార్లు చూస్తున్నారు, ఏయే ఫీచర్లు వాడుతున్నారు, మీ ఫ్రొఫైల్ ఫోటో, స్టేటస్‌లతో పాటు పలు ఇన్ఫర్మేషన్ని ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటుంది. మీరు ఏ డివైజ్ వాడుతున్నారు, మీ మొబైల్ నెట్వర్క్, ఐపీ అడ్రస్ వంటి డివైజ్ స్థాయి సమాచారాన్ని కూడా వాట్సాప్ సేకరిస్తుంది. డివైస్‌లో లొకేషన్ ఆన్ చేయగానే మీ లొకేషన్ వివరాలను సేకరించడంతో పాటు, లొకేషన్ ఆఫ్ చేసినప్పుడు ఉంటున్న ప్రాంతాన్ని అంచనా వేసేందుకు ఏరియా కోడ్‌ను సేకరిస్తుంది వాట్సాప్. అయితే వినియోగదారులు ఎవరితోనైనా లొకేషన్ షేర్ చేసుకుంటే మాత్రం దానికి ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉంటుందని వాట్సాప్ తెలిపింది.