ప్రైవసీ పాలసీ ని వాయిదా వేసిన వాట్సప్…!?

January 16, 2021 at 2:22 pm

ఇటీవలే ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనను ఇంకొన్ని రోజులపాటు వాట్సప్‌ వాయిదా వేసింది. ఈ విషయాన్ని తన బ్లాగ్‌ పోస్ట్‌లో ప్రకటించింది. కస్టమర్స్ వ్యక్తిగత సమాచారం మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్‌కు షేర్‌ చేస్తోందంటూ ఇటీవల వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌ చేస్తోందంటూ వాట్సప్‌ వినియోగదారులు ఇతర టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌లకు మారిపోతున్నారు. ప్రైవసీ పాలసీపై వస్తున్న వార్తలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొందని, అందుకోసమే ఈ నిబంధనను వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది.
వాట్సప్‌ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధన ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ తాజాగా దానిని మే 15 వరకు వాయిదా వేసింది. దీంతో ఫిబ్రవరి 8 తర్వాత ఎవరి అకౌంట్స్ నిలిపివేయడం కానీ, తొలగించడం కానీ లేదని వారు తెలిపారు. కొత్త ప్రైవసీ విధానంలో వ్యక్తిగత సంభాషణలు సహా ప్రొఫైల్‌ సంబంధిత ఇతర వివరాలేవీ ఫేస్‌బుక్‌తో పంచుకోవడం ఉండదని సంస్థ స్పష్టం చేసింది.

ఇప్పటివరకు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం షేరింగ్‌పై వస్తున్న వార్తలను ఆపడానికి సహాయం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అంటూ వాట్సప్‌ పేర్కొంది. ఇంకా కొద్ది రోజుల క్రితం వాట్సప్‌ కొత్త టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీ తీసుకొస్తున్నట్లు ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వినియోగదార్లు వాట్సప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే అందుకు సంబంధించిన విధి విధానాలతో ఉన్న జాబితా చూపిస్తూ ఒక పాప్‌ అప్‌ విండో కనిపిస్తుంది. ఇందులో భాగంగా వినియోగదారులు వ్యక్తిగత సమాచారంతోపాటు ఐపి అడ్రస్‌ వంటి వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటారని వార్తలు వచ్చాయి. తాజాగా వాట్సప్‌ దీనిపై స్పందిస్తూ కేవలం బిజినెస్‌ అకౌంట్స్ కి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌ ఖాతాలతో పంచుకుంటామని, వాణిజ్యపరమైన అవసరాలకు మాత్రమే తాము ఉపయోగిస్తామని తెలిపింది. వాట్సప్‌ అప్‌డేట్‌పై ప్రజల్లోకి తప్పు సమాచారం వెళ్లడంతో తాత్కాలికంగా అప్‌డేట్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రైవసీ పాలసీ ని వాయిదా వేసిన వాట్సప్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts