ఓటీటీలో రిలీజ్ కానున్న సైనా నెహ్వాల్ బయోపిక్‌.. !

January 28, 2021 at 4:05 pm

గత కొంత కాలంగా బయోపిక్స్ మూవీల హవా కొనగాగుతూనే వుంది. ప్రస్తుతం బాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందుతుంది. ఈ చిత్రంలో సైనా నెహ్వాల్ పాత్రలో బాలీవుడ్ప నటి పరిణితీ చోప్రా నటిస్తోంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రం షూటింగ్‌ కోసం పరిణితీ చోప్రా బాడ్మింటన్ నేర్చుకుంటూ సినిమా కోసం చాలా కష్ట పడుతుంది. కిందటి సంవత్సరం వేసవిలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అంతగా ఇష్టంగా లేరంట మూవీ నిర్మాత. దీనికి కారణం పూర్తిగా థియేటర్స్ ఓపెన్ కాకపోవటమే. కాబ్బటి అతి త్వరలోనే సైనా బయోపిక్‌ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది అని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఓటీటీలో రిలీజ్ కానున్న సైనా నెహ్వాల్ బయోపిక్‌.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts