అక్కడ భార్యలను రూ.10కే అద్దెకిస్తారట..!

January 24, 2021 at 2:23 pm

పేరుకు పవిత్ర భారతం గా పిలవబడుతుంది మన దేశం. ఇక్కడ మహిళలను శక్తి స్వరూపాలుగా చూడాలన్నది మన సనాతన ధర్మం. కానీ పరిస్థితులు మాత్రం వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మన దేశంలో మహిళలను పూజించడం, గౌరవించడం అటు ఉంచితే అత్యంత సంఖ్యలో వారిపై దాడులు చేసి, అత్యాచారాలు చేసి దారుణంగా హత మారుస్తున్న సంఘటనలు నిత్యం ఎన్నో చుస్తునాం. ఇప్పుడు ఈ పాశవకత్వానికి పరాకాష్ఠగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటికీ ఓ దురాచారం ఇంకా కొనసాగుతోంది. అదేంటంటే అక్కడి మహిళలను అంగడి సరుకుల్లా అమ్ముతుంటారు. ఇంకా నీచం ఏంటంటే సొంత మొగుడి తమ భార్యని పరాయి పురుషులకు డబ్బు కోసం అద్దెకి ఇస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా, శివపురి గ్రామంలో ఇలాంటి దురాచారమే ఇప్పటికి కొనసాగుతోంది. శివపురి ప్రాంతంలో గ్వాలియర్ రాజపుత్రులు నివశిస్తుంటారు. వీరిలో అనేక మంది డబ్బున్నవారు ఉన్నారు. వీరికోసం ఈ ప్రాంతంలో ఓ అనాచారమైన సౌకర్యం ఉంది. అదేంటంటే ఆ ప్రాంతంలో ఉండే పేద మహిళల్లో తమకు నచ్చిన వారిని, నచ్చిన టైములో అద్దెకె తీసుకునే సౌలభ్యం ఉంటుంది. దీనికి ఆ పేద మహిళల కుటుంబాల్లో భర్తలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అంగీకరిస్తారు. దీని కోసం వారికి కొంత మొత్తంలో డబ్బు కూడా లభిస్తుంది. ప్రతి ఏడాది సీజనల్‌గా నిర్వహించే ఈ దురాచారానికి ‘అడీచప్రద’ అని పేరు పెట్టుకున్నారు.

ఈ దురాచారంలో అమ్మాయి అందానికి, వయసుకే ప్రాముఖ్యత. 16 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మహిళలను ఇలా అద్దెకిస్తుంటారు వాళ్ళ మొగుడులు. అయితే దీనిపై మహిళల అభిప్రాయాలకు కానీ, వారి ఆత్మాభిమానానికి కానీ అసల విలువ ఉండదు. ఆ మహిళకు నచ్చినా, నచ్చకున్నా కచ్చితంగా ఆమె సొమ్ము చెల్లించిన వ్యక్తితో వెళ్లాల్సిందే. అమ్మాయి అందం, వయసును బట్టి, అద్దెకు తీసుకునే కాలాన్ని బట్టి 10 రూపాయల నుంచి లక్ష, రెండు లక్షల వరకు సదరు మహిళలకు ఒక ధర నిర్ణయిస్తుంటారు వాళ్ళ భర్తలు. దీనికోసం చట్టపరంగా స్టాంపు పేపర్లపై ఇరు పార్టీలు సంతకాలు చేసుకుని ఒక్క ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కూడా ఎంత మాత్రం పట్టించుకోరు. ఇలాంటి ఒప్పందాలను ఒకే మహిళతో ఎంతమంది మగవారైనా, ఎన్ని సార్లయినా చేసుకోవచ్చు. ఈ దురాచారానికి ఇక్కడి మహిళలు కూడా అలవాటయిపోయింది. ప్రస్తుతం ఈ కుటుంబాల్లో పుట్టిన కొందరు యువతులు వేరే ప్రాంతాల్లో చదువుకోవడంతో దూరంగా వెళ్లిపోయి ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నారు. తమ కుటుంబాలను ఈ దురాచారం నుంచి బయటపడేసేందుకు ఆందోళనలు సైతం చేస్తున్నారు. ఇటువంటి దురాచారాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. దీనికోసం మనందరం ఒక్కటి అయ్యి రూపు మాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అక్కడ భార్యలను రూ.10కే అద్దెకిస్తారట..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts